Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 5:51 pm Posted by : ramakrishna

ఇందల్వాయిలో దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇందల్వాయి, బతుకమ్మ : దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇందల్ వాయి గ్రామం లో చారిత్రాత్మక లక్ష్మణ రహిత రామాలయం లో శ్రీ రామసేనా, మీదివాడ శరన్నవరాత్రి ఉత్సవ సమితి వారి ద్వారా రామాలయ ప్రధానా అర్చకులు శ్రీమాన్ శ్రీ కందాళ రాజగోపాల చారి దీపక్ శాండిల్య ఆధ్వర్యంలో సుమారుగా 110 మంది దీక్ష మాల ధారణ స్వీకరించారు.  ఈ మాల ధరించిన స్వాములు నవరాత్రి  రోజులలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంకాలం రోజు ఒక రూపం తో అమ్మవారిని అలంకరించి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళా మణులు నిత్యం మంగళ హారతులు నైవేద్యాలతో నిత్యం పూజ కార్యక్రమాలను నిర్వహించి దసరా రోజు స్థానిక రామాలయం లో సేవా కార్యక్రమం నిర్వహించి ఉద్వాసన చేసి శుక్రవారం రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు ఇందల్వాయి గ్రామంలో విశేషంగా జరుపుకుంటారు.