డంపింగ్‌యార్డ్, మున్సిపల్ కార్యాలయం తనిఖీ
బతుకమ్మ, బోధన్ : బోధన్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై ఉన్నతాధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), బోధన్ సబ్ కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ సిబ్బంది డంపింగ్‌యార్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అంతర్గత రహదారుల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ ప్రక్రియను తక్షణం ప్రారంభించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. షక్కర్‌నగర్ రోడ్డుపై తాగునీటి పైపులైన్ల లీకేజీల సరిదిద్దే పనులను పరిశీలిస్తూ, పనులను శాశ్వతంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. తరువాత...