Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 5:21 pm Posted by : ramakrishna

విద్యుత్ ప్రజావాణికి అధికారులు డుమ్మా 

 బతుకమ్మ పిట్లం :  పిట్లం మండల కేంద్రంలోని అసిస్టెంట్ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రతి సోమవారం విద్యుత్ విద్యుత్ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిబంధన ఉంది. అయినప్పటికీ ప్రతి సోమవారం ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడం శోఛనీయం. ప్రతి సోమవారం కరెంటు సమస్యల కొరకు దరఖాస్తులను చేసుకోవడానికి లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ వెలుతున్నారు.  ఉండవలసిన అధికారులు లేకపోవడం ఒక సమస్య అయితే, కార్యాలయం కి వచ్చిన పాపన పోలేదు. సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయో తెలియక ఎవరికి ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పిట్లం సబ్ డివిజన్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఇన్చార్జిల పాలన కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.