. . . ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నిజామాబాద్, బతుకమ్మ :
గ్రామ పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు సోమవారం శిక్షణ నిర్వహించిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ శిక్షణకు డుమ్మా కొట్టిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ధర్మారం(బి) జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టార్ సంధ్యానాయక్, ఇందల్వాయి జడ్పీహెచ్ ఎ స్ స్కూల్ అసిస్టెంట్ లక్ష్మీనాథం, జడ్పీహెచ్ఎస్ ఘన్ పూర్ స్కూల్ అసిస్టెంట్ నారాయణ, డిచ్ పల్లి రైల్వేస్టేషన్ జడ్పీహెచ్ ఎస్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ సయ్యాద్ హుస్సెనీ బుకారి, సాలూరా జడ్పీహెచ్ ఎస్ ఎస్ఏ జి.సాయిలు, జాకోరా జడ్పీహెచ్ ఎస్ స్కూల్ అసిస్టెంట్ స్వామిలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ డిఈవో పి.అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల్లో షోకాజ్ నోటీసులకు సమాదానం చెప్పాలని నోటీసులో తెలుపాలని ఉత్తర్వులు జారీ చేశారు.