Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 2:04 pm Posted by : ramakrishna

పనిచేసే వారికి సముచిత గౌరవం

ఆర్మూర్,  బతుకమ్మ :  ఆర్మూర్ నియోజక వర్గంలోని రెండు మండలాలకు బీఆర్ఎస్ పార్టీ కొత్త అధ్యక్షులను నియమించారు. మాక్లూర్ మండలానికి గోపు రంజిత్, డొంకేశ్వర్ మండలానికి నక్కల భూమేష్ లను బీఆర్ఎస్ అధ్యక్షులుగా నియమిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాక్లూర్ మండల పార్టీ అధ్యక్షుడుగా నియమితుడైన గోపు రంజిత్ గుంజిలీ గ్రామానికి చెందిన వారు. పీఏసీఎస్ మాజీ  చైర్మన్  రంజిత్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కూడా పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నారు. తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గుంజిలీ గ్రామ సర్పంచిగా పోటీ చేసిన తన సోదరుడు గోపు గోపీ ని 546 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా రంజిత్ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించారు. అలాగే డొంకేశ్వర్ మండలం గాదెపల్లి గ్రామానికి చెందిన నక్కల భూమేష్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో వారిద్దరినీ మండల శాఖల బీఆర్ఎస్ అధ్యక్ష పదవులు వరించాయి. ఇదిలావుండగా గుంజిలీ గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ అభ్యర్థి గోపీని భారీ మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన రంజిత్ ను జీవన్ రెడ్డిఅభినందించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత గౌరవం లభిస్తుంద న్నారు. మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులుగా నియమితులైన రంజిత్, భూమేష్ లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


Due respect for those who work

గోపు రంజిత్