పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సీ.పీ (అడ్మిన్) జి.బస్వరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీపాదరావు ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వరెడ్డి మాట్లాడారు. ఆయన మూడుసార్లు శాసనసభ సభ్యులుగా ఎన్నికై, శాసనసభ స్పీకర్ గా పని చేశారని తెలిపారు. ఆయన ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను...