దుద్దిళ్ల శ్రీపాద రావుసేవలు చిరస్మరణీయం
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, దుద్దిళ్ల శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి సందర్భంగా ఆదివారం శాసనసభ లాంజ్ లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, జగిత్యాల, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, సంజీవ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు ...