పాఠశాల అభివృద్ధికి నడుము బిగించిన దుబాయ్ లొద్ది రామన్న కమిటీ
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన దుబాయ్ లొద్ది రామన్న ఆలయ కమిటీ సభ్యులు ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నడుము బిగించారు. గ్రామ కమిటీ సూచన మేరకు పాఠశాలలో పలు సౌకర్యాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే తడువుగా కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి విద్యార్థులను వారి అవసరాలను అడిగి తెలుసుకొని సమస్యలను గుర్తించారు. అందులో విద్యార్థులకు అత్యవసరమైన పనులను ఎన్నుకొనివాటిని యుద్ధప్రాతిపదికన త్రాగునీటి కోసం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ తో పాటు వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు...