Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 8:41 pm Posted by : ramakrishna

పాఠశాల అభివృద్ధికి నడుము బిగించిన దుబాయ్ లొద్ది రామన్న కమిటీ

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన దుబాయ్ లొద్ది రామన్న ఆలయ కమిటీ సభ్యులు ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నడుము బిగించారు. గ్రామ కమిటీ సూచన మేరకు పాఠశాలలో పలు సౌకర్యాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే తడువుగా కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి విద్యార్థులను వారి అవసరాలను అడిగి తెలుసుకొని సమస్యలను గుర్తించారు. అందులో విద్యార్థులకు అత్యవసరమైన పనులను ఎన్నుకొనివాటిని యుద్ధప్రాతిపదికన త్రాగునీటి కోసం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ తో పాటు వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసి పైప్ లైన్ల నిర్మాణం చేపట్టారు. పాఠశాలలో ఉన్న కంప్యూటర్లను కరెంట్ లేని సమయంలో ఉపయోగించేందుకు వీలుగా గతంలో ఏర్పాటు చేసిన బ్యాటరిల స్థానంలో కొత్త బ్యాటరిలను మార్చి ఏర్పాటు చేశారు. తరగతి గదుల కు ఉన్న కిటికీ రెక్కలు మార్పించారు. పాఠశాల అభివృద్ధి కొరకు దాదాపు ఇప్పటికే సుమారు రూ.180000  కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేశారు. భవిష్యత్తులో పిల్లల కొరకు డెస్క్ బెంచ్ లను కొనుగోలు చేసి స్టూడెంట్స్ కు అందుబాటులో కి తెస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం వాటర్ ప్లాంట్ ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో ఉన్నత, ప్రైమరీ హెడ్ మాస్టర్లు కరుణాకర్, దిలీప్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న దుబాయ్ రామన్న కమిటీ సభ్యులకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.