Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2024, 7:24 pm Posted by : ramakrishna

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే డీఎస్పీ ధర్మ యుద్ధం

  • డీఎస్  పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్

నిజామాబాద్ సిటీ, బతకమ్మ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ధర్మసమాజ్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పార్టీ జిల్లాకార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 90% ఉన్న బీసీ, ఎస్సి, ఎస్టీ, డి ఎఫ్ సి పేద ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. అలాగే రానున్న స్థానిక సమస్త ఎన్నికల్లో సమరంలో ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఎల్లవేళలా పేద ప్రజల కోసం ముందుండి పనిచేయాలని, వారికి ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదురైన వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. కేవలం అధికారం, పదవుల కోసం కాకుండా బలహీనవర్గాల సమస్యలను పరిష్కరించినప్పుడే పార్టీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుమన్, రాష్ట్ర నాయకులు ప్రేమ్, జిల్లా అధ్యక్షులు మహిపాల్, రాజేశ్వర్, ప్రశాంత్, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

DSP's moral war is for the upliftment of the weaker sections of Badugu