బతుకమ్మ, నిజామాబాద్ :
నిజామాబాద్ కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖ్ఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేంధర్ నిఖ్ఖత్ జరీన్ కు డీఎస్పీగా ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గెలిచి చాంపియన్ గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నజరానాతో పాటు హైదరాబాద్ లో నివాస స్థలాన్ని కేటాయించిన విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డును ప్రధానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖ్ఖత్ జరీన్ నియమించింది.