- ట్యాంకర్ ద్వారా పొలానికి నీరు
- ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్
ఇందల్వాయి, బతుకమ్మ: ఎల్లారెడ్డిపల్లి, హన్సన్ పల్లి గ్రామంలో వేసిన వారి పొలాలు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో వరి పొలాలు ఎకరాల కొద్ది ఎండిపోయిన సంఘటన నెలకొంది. దీంతో చేతికొచ్చే పంట రాకుండా పోతుందని రైతు రాజు మనోవేదనకు గురయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతు రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు ఎన్నో మార్లు మండలంలోని వివిధ గ్రామాలకు కెనాల్ ద్వారా నీటిని సప్లై చేయమని కోరిన ఎవరు పట్టించుకున్న నాధులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తను వేసుకున్న పంట పొలం దాదాపు 5 ఎకరాల వరకు ఉంటుందని దీనిలో మూడు బోర్లు వేసిన ఒక చుక్క నీరు కూడా రావడంలేదని దీంతో పంట పూర్తిగా నీలమట్టం అయిందని అన్నారు. ట్యాంకర్ ద్వారా నీరు పారించడానికి చాలావరకు భారం పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోని కెనాల్ల ద్వారా రైతులను నీరు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. బిజెపి మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ గత బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలో చాలావరకు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసిన ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు.

గత ప్రభుత్వాలు పాపమే ఈరోజు రైతులకు శాపంగా మారిందన్నరు. రైతుల పక్షాన నిలబడి రైతులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా రైతులకు కెనల్ల ద్వార అందించే ప్రయత్నం చేయాలని కోరారు.లేని పక్షంలో రైతులు పెద్ద మొత్తంలో రోడ్లపై వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతుల పొలాలు ఇంత పెద్ద మొత్తంలో ఎండిపోతున్న ఏవోలు,ఏఈవోలు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఏ రైతు పొలంకు ఎంతవరకు నష్టం జరిగిందనేది ఇప్పటివరకు లెక్కలు తీయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఏవోలు, ఏఈవోలు రైతుల ఇంటింటికి తిరిగి లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు నాయిడి రాజన్న రైతులు,బిజెపి నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.
