పిట్లంలో డ్రై డే

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం నాడు డ్రై డే ను ఎంపీడీవో రఘు, హెల్త్ సూపర్వైజర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. పిట్లం లో ఉన్న కాలనీల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో సూచించారు. డ్రై డే ను ప్రతి ఒక్కరూ పాటిస్తే వర్షాకాలంలో అంటూ వ్యాధులు రావని పేర్కొన్నారు. నీటి ప్రభావము లేకుండా చూసుకోవాలని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో బలరాం, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎమ్స్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.