Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 4:20 pm Posted by : ramakrishna

జుక్కల్ లోని 30 గ్రామాలలో డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం

 

జుక్కల్, బతుకమ్మ

 

జుక్కల్ మండలంలోని పడంపల్లి తో పాటు మిగతా 29 గ్రామ పంచాయతీలలో శుక్రవారం నాడు ఆయా గ్రామాల సర్పంచ్ ల ఆధ్వర్యంలో డ్రైడే -ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పడంపల్లి గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు, ఉప సర్పంచ్ పావుడే సవిత బస్వంత్ ఆధ్వర్యంలో గ్రామంలో డ్రైడే ఫ్రైడే నిర్వహించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచ్ తో కలిసి జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు పర్యటించారు. గ్రామంలోని వీధులలో డ్రైనేజ్ వాటర్ రోడ్ల పైన వదలకూడదని, మురికి నీరు మురికి కాలువలోనే వదలాలని కాలనీవాసులకు సూచించారు. గ్రామంలోని చెత్తాచెదారం తడి చెత్త పొడి చెత్త వేలు చేసి ఇంటి ముందుకు వచ్చే ట్రాక్టర్లోనే వెయ్యాలని గ్రామస్తులకు తెలిపారు. అదే విధంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని వృధా చేయవద్దని నల్లాల వద్ద నీరు అవసరం మీదకి వాడుకోవాలని అనంతరం ట్యాప్ బంద్ చేయాలని పేర్కొన్నారు. మురికి నీరు రోడ్లపై ప్రవహిచడం వలన దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి, ఎఫ్ ఏ సూర్యకాంత్, గ్రామస్తులు, జిపి సిబ్బంది వాగ్మారే మారుతి, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.