Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:08 pm Posted by : ramakrishna

మత్తు జీవితాలు చిత్తు

బతుకమ్మ,మోర్తాడ్: డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించడం మనందరి దేయం కావాలని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. టి. పెద్దన్న అభిలాషించారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ రహిత అవగాహన సదస్సు నిర్వహించారు. నార్కో టెర్రరిజం దేశ ఆర్థిక వ్యవస్థను, యువతను, సాంస్కృతిని చిన్నభిన్న చేసేందుకు విదేశీ మార్గాల ద్వారా మన దేశానికి మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న శత్రుదేశాల కుట్ర అని ఆయన పేర్కొన్నారు. 61 శాతం యువత కలిగిన ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం మనదేశ యువతను మత్తుమందుకు బానిస చేసి చిన్నభిన్నం చేయాలని మారకద్రవ్యాలను అలవాటు చేసి శారీరక, మానసిక, అనారోగ్యానికి, అసాంఘిక కార్యక్రమాలకు, యువతను పురిగోలుపుతుందని పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయంలో ఇది వినియోగిస్తే జైలు పాలవుతున్న యువత పేడదోవ నుంచి కాపాడాలని సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు నైపుణ్యాలను వారిలో పెంపొందించాలని కోరారు కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ కమిటీ కోఆర్డినేటర్ రాజయ్య, అధ్యాపకులు బ్యూల, అర్చన, వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, అకాడమీ కోఆర్డినేటర్ దశరథ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.