Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2025, 9:04 pm Posted by : ramakrishna

టోల్ ప్లాజా సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో టోల్ ప్లాజా సమీపంలో సీఐ సంపత్ కుమార్ ఎస్సై ఆంజనేయులు శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎన్లైజర్ తో తనిఖీలు చేశారు. నెంబర్ ప్లేట్ లేని 20 వాహనాలను స్టేషన్ కు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా అనుమతి పత్రాలు, లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జగదీష్ నరేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.