ఎల్లారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి రెండవ ఎస్సై సుబ్రహ్మణ్య చారి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి ముగ్గురిని పట్టుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆ ముగ్గురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సుబ్రహ్మణ్య చారి మాట్లాడుతూ ప్రాణాలతో ఆడుకునే డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నిబంధనల ఉల్లంఘనను అస్సలు ఉపేక్షించం. ఎవరైనా నియమాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని...