Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 7:28 pm Posted by : ramakrishna

మత్తు పదార్థాలను అరికట్టాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

 

కామారెడ్డి, బతుకమ్మ : డ్రగ్స్ ,గంజాయి ,కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలను అరికట్టే కార్యాచరణ లో భాగంగా 11 వ జిల్లా ఎన్సీఓఆర్డీ  మీటింగ్ గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్  కార్యాచరణ ప్రణాళికను సమీక్షించి భవిష్యత్తు లో చేయవలసిన కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు. గంజాయి , కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలు తాగే వారి అలవాటు మానిపించడం కోసం ఎన్జీఓ లు, వైద్య ఆరోగ్య శాఖ  సహకారం తో వారిని ఆ అలవాటు నుండి బయట పడే విధంగా చేయాలని కోరారు. అన్ని విద్యా సంస్థలు, విద్యార్థుల కు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు వివరించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. జిల్లా అధికారులు అందరూ పూర్తి సహకారం తో కామారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  మాట్లాడుతూ ఎన్ఢీపీఎస్ చట్టం అమలు చేసేటప్పుడు సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చట్టం లో ని నిబంధనల ను తు చ తప్పకుండా పాటించాలని ,డ్రగ్స్ బారిన పడిన వ్యక్తులను వారి యొక్క ప్రవర్తన, శారీరక లక్షణాలు బట్టి గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో, డి అడిక్షన్ సెంటర్ లో చేర్పించి అదే విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో వారిని చైతన్య పరిచి ఆ అలవాటు నుండి బయటపడేలా చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ , జిల్లా ఎక్సై అధికారి బి.హనుమంతరావు, డీఈఓ రాజు, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీడబ్ల్యూఓ ప్రమీల, టీజీఎన్ఏబీ సీఐ, వివిధ ఎన్జీఓ సంఘాలు పాల్గొన్నారు.