మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి  మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ...చాలా మంది యువత డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు కు బానిసలుగా మరి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నిర్ములన పై అవగాహన ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.