Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 12:44 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు

రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది

శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ : రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా పడి నీళ్లు ఉన్నా.. ఎండలతో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఈప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారని గుర్తు చేశారు.  కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయని విమర్శించారు. మార్చి లోనే ఈవిధంగా ఉంటే ఏప్రిల్, మే నెల ల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయడు 10వేల క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు.  హైద్రాబాద్ లో వాటర్ ట్యాంకర్లు పెరిగాయన్నారు.  కేసీఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించారని ఆయన మీద కోపంతో ఆ నీళ్లు వాడుకోక పోవడం కరెక్ట్ కాదన్నారు.  ఇప్పటికైనా ఉన్న నీటి వనరులు వాడుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.