ఫాం పాంట్స్, ఫిష్ పాండ్ పై అవగాహన కరువు

బతుకమ్మ, మోర్తాడ్:  భూగర్భ జల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన పంట భూములు నీటి నిల్వ గుంతలు నిర్మాణం పై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని వినియోగించుకోవాలని సదుద్దేశంతో తలపెట్టిన ఫాం పాంట్స్ నిర్మాణాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఉపయోగించుకోలేదు. ఫాం ఫాంట్స్ నిర్మాణంతో కలిగే ఉపయోగాలపై ఉపాధి హామీ సిబ్బంది అవగాహన కల్పించిన సందర్భాలు లేవని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ...