తహసీల్దార్ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన డీఆర్ఓ గీత
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా డీఆర్ఓ గీత గురువారం స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తహసీల్దార్ బాలయ్యతో మాట్లాడుతూ, కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన అవసరమైన పత్రాలను జిల్లా కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మండల కార్యాలయాల నిర్మాణానికి ఒక్కో మండలానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులో ఉండేలా...