Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 7:21 pm Posted by : ramakrishna

మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం

. . . సీఐ సత్యనారాయణ

 

భీంగల్, బతుకమ్మ :

 

రోజు వారిగా వాహనాలు నడిపేవారు మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టారీత్యా నేరమని, పట్టుబడితే రూ. 10 వేల జరిమాన, జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భీంగల్ సీఐ సత్యనారాయణ అన్నారు. పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం మంగళవారం మండలంలోని బడా భీంగల్ లో రోడ్డు భద్రత కార్యక్రమం లో భాగంగా అరైవ్ ఆలైవ్ ప్రోగ్రాం ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నారు. హెల్మెట్ వాడడం వలన అది మిమ్మల్ని రక్షిస్తుందని తెలిపారు. సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్ రూట్లో వాహనాలు నడుపవద్దని సూచించారు. ముఖ్యంగా వాహనాలను మైనర్ పిల్లలకు ఇవ్వడం నేరమని, అలా చేస్తే మైనర్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా ప్రమాదాల బారిన పడకుండా వాహనాలను నడపడం గురించి సీఐ గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి,ఉప సర్పంచ్ శంకర్ గౌడ్, ఏఎస్సై ఐ. సత్తార్, విల్లెజ్ సెక్రటరీ రజిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

Driving under the influence of alcohol is a crime.
Driving under the influence of alcohol is a crime.