. . . డివిజన్ లలో నిలిచిన చెత్త సేకరణ
. . . షెడ్డు కు పరిమితమైన చెత్త సేకరించే వాహనాలు
. . . వేతనాల కోసం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసనపర్వం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
చేస్తున్న పనికి సరైన సమయంలో, వేతనాలు రావడం లేదని మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్లు తాము పని చేయలేమాని చేతులు ఎత్తేశారు. నిజామాబాద్ బల్దియాలో డ్రైవర్లందరూ అవుట్ సోర్స్ ఉద్యోగులే. ఫిబ్రవరి మాసం సంబంధించిన వేతనం పక్షం రోజులు గడిచిన అందకపోవడంతో మంగళవారం విధులకు రాలేదు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వేతనాల కోసం దరఖాస్తులు చేసినా వినతి పత్రాలు సమర్పించిన ప్రయోజనం లేకపోవడంతో స్ట్రైక్ కూ దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్లు విధులకు రాకపోవడంతో చెత్త సేకరించే వాహనాలు షెడ్డు కు పరిమితమయ్యాయి. దానితో 60 డివిజన్లో చెత్త సేకరణ నిలిచిపోయింది. దాదాపు 130 కి పైగా మంది ఔట్సోర్సింగ్ డ్రైవర్లు ఉండగా 111 వాహనాల ద్వారా ప్రతిరోజు చెత్త సేకరణ జరుగుతుంది. ప్రతిరోజు 250 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డ్రైవర్లను విధులకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

. . . అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణం ఎఫెక్ట్ నా?
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత రెండు పాలక వర్గాల హయాంలో జరిగిన ఔట్ సోర్స్ ఉద్యోగుల నియామకాలు అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా నిలిచింది. కార్పొరేటర్ లు, అధికారులు, లీడర్స్ అంగట్లో సరుకుల పోస్టలు అమ్ము కున్నారు. అనర్హ్లలు విధుల్లో చేరరు. దానికి తోడు రెగ్యులర్ ఉద్యోగులు కాదని అవుట్ సోర్స్ ఉద్యోగులు పెత్తానo పెరిగింది. కొందరు బినామీ లు పని చేయకుండానే వేతనాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవుట్ సోర్స్ నియామకాలపై రేవంత్ సర్కార్ విచారణ కు ఆదేషీ oచింది. విచారణ క్రమంలో అక్రమాలు బహిర్గతం కావడం తొ వేతనాలు నిలిచిపోయాయి. ఔట్ సోర్స్ ఏజెన్సీ అక్రమాలపై విచారణ నేపథ్యంలో దాని ప్రభావం వేతనాలు చెల్లింపులపై పడింది. ప్రధానంగా మున్సిపల్ లో అప్పుడు ఎక్కువ నియామకాలు జరిగాయి.
