Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:26 pm Posted by : ramakrishna

మోటారు రోడ్డు ప్రమాదం చేసి యువకుని మృతికి కారణమైన డ్రైవర్ కు ఏడాది జైలుశిక్ష

 

. . . ఐపిసి సెక్షన్ 338 (తీవ్రమైన గాయాలు) ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష

 

. . . ఐపిసి సెక్షన్ 337 (సాదారణ గాయాలు) ప్రకారం నెలరోజుల జైలుశిక్ష

 

. . . నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వడ్డి హరి కుమార్ తీర్పు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

ఒకరి మృతికి మరో ఇద్దరికి గాయాలు కావడానికి కారణమైన క్వాలీస్ కారు డ్రైవర్ కు సంవత్సరం, ఆరు నెలలు,ఒక నెల చొప్పున జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి వడ్డి హరి కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. తీర్పులోని వివరాలు నిజామాబాద్ నగరం వెంగల్పాడ్ నివాసులైన షేక్ అఫ్జల్, షేక్ సర్వర్, షేక్ ఖాసీమ్ మోటారు బైక్ పై ఆర్మూర్ నుండి నిజామాబాద్ కు 2017 సంవత్సరం జనవరి 13 న వస్తుండగా వారి బైక్ అడవి మామిడి పల్లి గ్రామ శివారులోకి రాగానే టైర్ పంప్చారు కావడంతో బైక్ ను నూకుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో దాస్ నగర్ నవ్య భారతి పాఠశాల వద్ద అర్ధరాత్రి మూడున్నర గంటల సమయంలో వారి వెనుక నుండి వచ్చిన క్వాలిస్ కారును నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా డ్రైవ్ చేసి ముగ్గురికి టక్కర్ ఇవ్వగా వారిలో షేక్ అఫ్జల్ తలకు, ఇతర శరీర బాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ ఖాసీమ్, షేక్ సర్వర్ లకు తీవ్ర గాయాలు, సాధారణ గాయాలు అయినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. భారత శిక్షస్కృతి సెక్షన్ 304(ఎ ) ప్రకారం కారుతో ప్రమాదం చేసి ఒకరి మృతికి కారణమైన నేరంకుగాను ఒక సంవత్సరం కఠిన జైలుశిక్ష విధించారు. సెక్షన్ 338 ప్రకారం తీవ్రమైన గాయాలు కలగడానికి కారణమైనందున ఆరు నెలల జైలుశిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా రెండు నెలల జైలుశిక్షకు గురి కావాలని పేర్కొన్నారు. సెక్షన్ 337 ప్రకారం సాదారణ గాయాలు కలగడానికి కారణబూతుడు అయినందున నెల రోజుల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి హరి కుమార్ తమ తీర్పులో వ్రాశారు.