Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:09 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి కొరత…

 

. . . ఇందల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దుస్థితి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో పాటు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ వాళ్లకు చెందిన మినీ వాటర్ ట్యాంక్ దగ్గర ప్లేట్లను శుభ్రం చేసుకోవడంతో పాటు త్రాగునీటి కోసం క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.. దీంతో పాఠశాల యజమాన్యం గాని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకొని పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థిని విద్యార్థులు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇందల్వాయి గ్రామానికి చెందిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో త్రాగునీటి సమస్య ఏర్పడితే తక్షణమే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులు విద్యార్థులు స్కూల్ బయట ఉన్నటువంటి మినీ వాటర్ ట్యాంక్ వద్ద ప్లేట్లను శుభ్రం చేసుకోవడంతో పాటు త్రాగునీటి కోసం వరసలో నిలిచి ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ సర్పంచ్ ప్రత్యేక చర్యలు తీసుకొని పాఠశాలలు తాగునీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.