Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 3:18 pm Posted by : ramakrishna

అక్బర్ నగర్ లో తాగునీటి కొరత

  •  మూడు రోజుల నుంచి తాగునీటి కరువు
  • రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
  • అధికారులలో సమన్వయ లోపం
  • స్పందించని అధికారులు

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలం లోని అక్బర్ నగర్ గ్రామంలో  త్రాగునీటి కొరత తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో త్రాగునీరు రావడం లేదని, త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆరోపించారు. గత మూడు రోజుల నుంచి  త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు  రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి సమస్య పై ఇప్పటివరకు అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు మోటర్ మరమ్మత్తుల దశకు చేరిందని, టెక్నీషియన్ వచ్చి బోరు మోటర్ చూసి ఇది ఉపయోగంలోకి రాదని, ఉన్నతాధికారులే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని  గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులే ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా అంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.