Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 5:45 pm Posted by : ramakrishna

తాగునీటి సమస్య పరిష్కారం 

బతుకమ్మ, పిట్లం :   పిట్లం గ్రామంలోని పాత గ్రామపంచాయతీ వరకు నీటిని  సరఫరా చేసే పైప్ లైన్ పగిలిపోవడంతో ,హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని జెసిపి ద్వారా పైప్ లైన్ ను తవ్వించి చెడిపోయిన పైపు ను కట్ చేసి మరమ్మత్తులు చేయించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ నీటిని వృధా చేయరాదని, గ్రామపంచాయతీకి సంబంధించిన నల్లాలను అవసరం మేరకు వాడుకొని అవసరం లేనప్పుడు బంద్ చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వేసవికాలం ఉన్నందున ప్రతి ఒక్కరికి నీటి అవసరం ఉంటుందని, ప్రతి ఒక్క నీటి బొట్టు ప్రస్తుతం అవసరమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది బిల్  కలెక్టర్ కృష్ణారెడ్డి, అంకం శ్రీను, చెవుల శ్రీను,  వాటర్ మెన్ సాయిలు, సుభాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.