బతుకమ్మ, పిట్లం: మండలంలోని కోమటిచేరు తాండా, గౌరారం తాండ, కంబాపూర్, మార్దండ, మద్దెలచెరువు, బండపల్లి, గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎంపీడీవో కమలాకర్ కార్యదర్శిలకు సూచించారు. గురువారం నాడు గ్రామపంచాయతీ లను పర్యటించి వైకుంఠధామము నిర్వహణ, కంపోస్ట్ షెడ్ యందు ఎరువు తయారు నర్సరీ యందు 100 మొక్కల పెంపకం మరియు పల్లె ప్రకృతి వనము నిర్వహణ సక్రమముగా చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు జారీ చేయనైనది. కార్యదర్శిలు బాలరాజ్, అంబయ్య, ఉన్నారు.
