Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 5:13 pm Posted by : ramakrishna

ముర్రు పాలు తాగించడం బిడ్డకు శ్రేయస్కరం

బతుకమ్మ, పిట్లం : అప్పుడు పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు తాగించడం బిడ్డకు శ్రేయస్కరమని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమలత పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ ఒకటవ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి ఆమె మాట్లాడారు. అంగన్వాడి సెంటర్లను ప్రతి బాలింతలు తల్లులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మీకోసమే వారానికి రెండుసార్లు బిర్యాని వండి పెడుతున్నాము అంగన్వాడి సెంటర్ కు వచ్చి భోజనం చేసి వెళ్లాలని ఆమె సూచించారు. అంగన్వాడికి వచ్చే పిల్లలను ఆన్లైన్లో పొందుపరచాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాధ, ఏఎన్ఎం మమత, ఆశా వర్కర్లు తల్లులు బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.