ఎండు గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

నిజామాబాద్, బతుకమ్మ : అక్రమంగా ఎండుగంజాయిని తరలిస్తున్న ఒకరిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులు తెలిపారు. ఏఈఎస్ సీహెచ్.విరాస్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు ఎ.వెంకటేష్, ఎల్.బాలకిషన్, సిబ్బంది శుక్రవారం బాబన్స పహాడ్ ఏరియాలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎండు గంజాయిని బైక్ పై తరలిస్తుండగా అమీర్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 260గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు...