Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 5:26 pm Posted by : ramakrishna

మంద కృష్ణ మాదిగ ని కలిసిన ద్రావిడ యూనివర్సిటీ వీసీ

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం ప్రాంతంలో ఉన్న ద్రావిడ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నియమితులైన మాదిగ మేధావి, ప్రొఫెసర్ ఎల్.సి.మల్లయ్య గురువారం ఎంఆర్ పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ ఎల్.సి మల్లయ్య కి శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ మల్లయ్య మంద కృష్ణ మాదిగ కి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.

 

Dravidian University VC meets Manda Krishna Madiga