నందిపేట్, బతుకమ్మ: డొంకేశ్వర్ మండల పరిధిలోని తొండకూర్ గ్రామంలో డ్రైనేజీ పనులు శనివారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల్ అధ్యక్షుడు మంద మహిపాల్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వైయస్ గంగాధర్, మైనార్టీ అధ్యక్షులు ఫరీద్, ఇసుబ్, తొండకూరు మాజీ సర్పంచులు దేవన్న, దశ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.