వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీల మరమ్మత్తులు చేపట్టాలి
. . . మున్సిపల్ అధికారులకు బీజేపీ కౌన్సిలర్ల వినతి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల మరమ్మత్తులు, పూడిక తొలగింపు, చెత్త శుభ్రపరిచే పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్ల బృందం ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న టీపీఓకు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, గత వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న డ్రైనేజీలను మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లపైకి నీరు చేరకుండా పెద్ద...