భారీ వర్షానికి దెబ్బతిన్న డ్రైనేజీ
బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడలో భారీ వర్షాలకు దెబ్బతిన్న డ్రైనేజీలను 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఎండి గౌస్ పాషా టీచర్ కాలనీలో పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందితో కలిసి ఎండి గౌస్ స్వయంగా వర్షం మధ్యలోను పరిశీలన చేపట్టారు. ప్రజల సమస్యలను దగ్గరగా గమనిస్తూ, తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను తెలిపారు.