Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 7:00 pm Posted by : ramakrishna

ముసాయిదా ఓటరు జాబితా వెల్లడి

నిజామాబాద్, బతుకమ్మ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఎస్ఆర్ -2025 లో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్వహించిన మీదట ముసాయిదా ఓటరు జాబితాను వెలువరించడం జరిగిందని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ ముసాయిదా ఓటరు జాబితా ప్రతులను అందజేశారు. అన్ని ఈ.ఆర్.ఓ, ఏ.ఈ.ఆర్.ఓ కార్యాలయాల్లోనూ డ్రాఫ్ట్ రోల్ ను ప్రచురించడం జరిగిందని వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 28 తేదీ లోపు తెలియజేయవచ్చని అదనపు కలెక్టర్ సూచించారు. డ్రాఫ్ట్ రోల్ విడుదల కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ ఉన్నారు.

Draft voter list released