Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 3:13 pm Posted by : ramakrishna

బోధన్ మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణ మున్సిపాలిటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు నంబర్లు 1 నుంచి 38 వరకు ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ గురువారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని  మున్సిపల్ కమిషనర్ సూచించారు. అనంతరం వచ్చిన అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో టీపీవో, మేనేజర్, టీపీబీవో, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లుతో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.