Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 6:00 pm Posted by : ramakrishna

నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మెన్ గా డాక్టర్ రమేష్ పవార్

 

. . .జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

 నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని అదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తైక్వాండ్ అసోసియేషన్ జిల్లా  చైర్మన్ గా డాక్టర్ రమేష్ పవార్, అధ్యక్షునిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మారే సుభాష్, శ్యామ్, మంజునాథ్, వినోద్ రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్ కుమార్, బుచ్చన్న, మురళి, వినోద్, ప్రవీణ్, సంతోష్ లను నూతన కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Dr. Ramesh Pawar as the Chairman of Nizamabad District Taekwondo Association

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ తమ సంఘానికి గుర్తింపునిచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది క్రీడాకారులను టైక్వాండో క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో రాబోవు రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు.ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్ గా ఫుట్ బాల్ కోచ్ జి. నాగరాజు ,ఒలంపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా అబ్దుల్ ఉమర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నెట్ బాల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. ఎస్. జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

Dr. Ramesh Pawar as the Chairman of Nizamabad District Taekwondo Association