Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 6:20 pm Posted by : ramakrishna

డా.ప్రభంజన్ కుమార్ అకాల మరణం తీరనిలోటు

  • తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఆచార్య చంద్ర శేఖర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డాక్టర్ ప్రభంజన్ కుమార్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు అని తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఆచార్య చంద్ర శేఖర్ అన్నారు. మాస్ కమ్యూనికేషన్ విభాగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. బుధవారం మరణించిన మాస్ కమ్యూనికేషన్ విభాగం విశ్రాంత సహాయ ఆచార్యుడు డాక్టర్ ప్రభన్ జన్ కుమార్ కు మృతికి విభాగం ఆచార్యులు విద్యార్థులు సంతాపం ప్రకటించారు. మాస్ కమ్యూనికేషన్ విభాగంలో విశ్రాంత ఆచార్యులు ప్రభంజన్ కుమార్ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించి,  నిమిషాలు మౌనం పాటించారు, అనంతరం   ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని తనకు తెలిసే 1995 నుంచి ఆయన బీసీల హక్కుల కోసం పోరాటాలు చేశారని అన్నారు. ఆయన వద్ధ ఉన్న పీ హెచ్ డీ పరిశోధకులనూ బహుజన భావజాలం ప్రాముఖ్యత చెప్పినదానికి అన్నాడు. ప్రభంజన రచనలు సబ్బండవర్గాల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉన్నాయని అన్నారు.  డిపార్ట్మెంట్ కు ఆయన చేసిన సేవలను మరియు ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకులు, పలువురు విద్యార్థులు ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాస్ కమ్యూనికేషన్ విభాగం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకులు డాక్టర్ మోహన్, డాక్టర్ ఇ శ్రీనివాస్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.