Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 4:50 pm Posted by : ramakrishna

డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : లగచర్ల రైతుల అరెస్టుకు నిరసనగా ఎల్లారెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాల మేరకు  మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దురహంకార పాలన, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం పై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన హామీలనే కదా అమలు చేయమని అడిగేతే, అడ్డగోలు హామీలు, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత రైతులను, ప్రజలను ముపపుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్, సొసైటీ చైర్మన్ నర్సింలు, నాగం రాజయ్య, మల్లారెడ్డి, రాజు, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, సాయిలు, బబ్లూ, మనోజ్, రవి.యూనేస్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.