డాక్టర్ నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారం పట్ల హర్షం
బతుకమ్మ ,భీమ్‌గల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ 14 భాషల్లో పట్టు కలిగిన బహుభాషావేత్త, తెలంగాణ పదకోశ రూపకర్త (నిర్మాత),తెలంగాణ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారం రావడం అభినందనీయమని ప్రముఖ కవి,...