భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను బీజేపీ బాల్కొండ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలం లోని పురానిపేట్ గ్రామానికి చెందిన ఎం.గోపాల్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరి ఆపరేషన్ అవ్వగా వారిని పరామర్శించి తగు ఆరోగ్య సూచనలు చేశారు. పల్లికొండ గ్రామ బిజెపి కార్యకర్త ముద్దుల ప్రశాంత్ వాళ్ల నాన్న అనారోగ్యంతో స్వర్గస్తులైనందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట భీమ్ గల్ మండల పార్టీ అధ్యక్షులు ఆరే.రవీందర్, పట్టణ అధ్యక్షులు కనికరం మధు,జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్,సీనియర్ నాయకులు మహిపాల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, సీనియర్ నాయకులు సంధ్యారాజు,తక్కురి అంజయ్య, శెట్టి లక్ష్మణ్, హరి ప్రసాద్, సురేందర్,గంగాధర్ గౌడ్, హకీమ్, బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రా ఇన్చార్జిలు, బీజేవైయం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.