కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు కామారెడ్డి జిల్లా ఒలింపిక్ డే రన్-2026 నిర్వహణ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా డా. ఎం. జైపాల్ రెడ్డి, కన్వీనర్‌గా డా. కె.పి. అనిల్ కుమార్ నియమితులయ్యారు. సభ్యులుగా సందీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్యలను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 20 న కామారెడ్డి జిల్లాలో ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడాభిమానులు, యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.