డాక్టర్ లకే టోకరా

రుణమాఫీ చేయిస్తానని రూ.90 లక్షలకు వరకు మోసం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆసుపత్రులను విస్తరించేందుకు, నిర్మించేందుకు తీసుకునే అప్పులనే టార్గెట్ చేసిన ఓ కేటుగాడు వారి రుణాన్ని మాఫీ చేయిస్తానని నమ్మబలికి మోసం చేశాడు. తనకు పెద్దలతో సంబంధాలున్నాయని, రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మించి ముంచేసిన ఘటన పోలీసులు అరెస్టు చేయడంతో వెలుగు చూసింది. నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి కథనం ప్రకారం నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడికి చెందిన ప్రముఖ వైద్యుడికి హైదరాబాద్ లోని ఖుత్భుల్లాపూర్ లోని...