Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 6:07 pm Posted by : ramakrishna

డా. కవితా రెడ్డి ని సన్మానించిన రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఐఐహెచ్ఎఫ్ డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కవిత రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్భంగా డాక్టర్ కవిత రెడ్డి ని రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో 369 రెడ్డి సంక్షేమ సంఘం నిజామాబాద్ అధ్యక్షుడు గాదరి సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోతే నవీన్ రెడ్డి, కోశాధికారి అరికెల శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ రెడ్డి సలహా దారులు నాగిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.