వేల్పూర్, బతుకమ్మ :
వేల్పూర్ మండలంలోని మోతె గ్రామానికి చెందిన డాక్టర్ రాకేష్ సతీమణి డా.బోడా మంజు భార్గవి, వ్యవసాయ రంగంలో విశిష్ట ఘనతను సాధించారు. దేశంలో ప్రఖ్యాత చెందిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీఎన్ఏయు) లో అగ్రానమీ విభాగంలో పీహెచ్.డి పట్టాను విజయవంతంగా పొందారు. అగ్రానమీ విభాగంలో పీహెచ్.డి పూర్తి చేసిన తొలి గిరిజన మహిళగా మంజు నిలవడం విశేషం. ఆమె తన విద్యా ప్రయాణంలో భాగంగా ప్రభుత్వ సేవల్లో కూడా ప్రతిభ కనబరిచారు.

జిల్లా సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారి గా విధులు నిర్వహించి, ప్రస్తుతం చెరకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ లో శాస్త్రవేత్తగా సమగ్ర వ్యవసాయంపై అధ్యయనం చేస్తున్నారు. డా.మంజు భార్గవి బోడా తన పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తూ రెండు అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించి శాస్త్రీయ వర్గాల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సాధించిన ఈ విజయంపై గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని, జిల్లా కు గర్వకారణం అని పేర్కొన్నారు.