భీంగల్, బతుకమ్మ :
పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను శనివారం డీపీవో శ్రీనివాస రావు సందర్శించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్ సదుపాయాలు, ఏదైనా ఇబ్బందులు ఉంటే తన ద్రుష్టి కి తేవాలని సూచించారు. స్టూడెంట్స్ కొరకు తయారు చేసిన ఆహార పదార్థాలను అధికారి స్వయంగా పరిశీలించారు. నాణ్యమైన వంటసరుకులు, కూరగాయలు తేవాలని ఆదేశించారు. స్టూడెంట్స్ కు వేడి వేడి ఆహారం అందజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, కేజీబీవీ ఇంచార్జి ప్రిన్సిపాల్ గోదావరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.