Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 1:04 pm Posted by : ramakrishna

ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు

గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించం

శాసనసభలో మంత్రి కోమటి వెంకట్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ : గ్రామీణ రోడ్లు, రాష్ర్ట రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని శాసనసభలో మంత్రి కోమటివెంకట్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని పేర్కొన్నారు.  కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కే రోడ్లు వేశారని, ఆమూడు చోట్ల రోడ్లకు చివరకి సింగరేణి నిధులు కూడా  వాడారని వెల్లడించారు. ఈవిషయమై రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్ రావుకు కోమటి రెడ్డి సవాల్ విసిరారు.  ఈసవాల్ ను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒక రోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.