అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి
రుద్రూర్, బతుకమ్మ : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ సభలో పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లస్థలాల విషయంపై చర్చించారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో అవకతవకలు జరగకుండా అర్హులైన నిరుపేదలను గుర్తించి గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేయాలని...