Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 7:31 pm Posted by : ramakrishna

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ సభలో పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లస్థలాల విషయంపై చర్చించారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో అవకతవకలు జరగకుండా అర్హులైన నిరుపేదలను గుర్తించి గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు అమంద్ వెంకటేష్, లక్ష్మి, అమృత, ఇమ్రాన్, శివ, హరీష్, బచ్చు రామ్ సెట్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, కటికే రామ్ రాజ్, జిల్లా కౌన్సిల్ మెంబర్  ప్రశాంత్ గౌడ్, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.